కావలసిన పదార్థాలు:   బియ్యం : 1/2 కేజీ కొత్తిమీర : పెద్ద సైజువి 7 కట్టలు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ : 2 టీస్పూన్లు ఉప్పు : తగినంత దాల్చిన చెక్క: 2 చిన్న ముక్కలు లవంగాలు : 6 నూనె : సరిపడా తయారీ విధానం :  ముందుగా అరకేజీ బియ్యాన్ని ఉడికించి పొడి పొడిగా ఉండేలా అన్నం వార్చుకోవాలి. కొత్తిమీరను తరిగి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత బాణెలి లో సరిపడా నూనె పోసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిల పేస్ట్, చెక్క, లవంగాలు, వేసి కాసేపు వేయించాలి. ఆపై కొత్తిమీర పేస్టును కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న అన్నంలో పై మిశ్రమాన్ని, తగినంత ఉప్పును కలపాలి. అన్నం మొత్తం కొత్తిమీర మిశ్రమం బాగా కలిసేలా కలపాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: